అందాల తార శ్రీదేవి మరణం సిని ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఇప్పటికి ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ ఉన్నారు. దుబాయ్ లో ఆమె ఓ హోటెల్ లో స్నానానికి అని వెళ్లి శవమై తేలడం అందరిని ఆశ్చర్యపడేలా చేసింది. బాత్ టబ్ లో హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల శ్రీదేవి మరణించిందని తెలిసిందే.


అయితే లేటెస్ట్ గా మళ్లీ శ్రీదేవి డెత్ మిస్టరీ తెర మీదకు వచ్చింది. అదికూడా ఓ సినిమా వల్ల అది చర్చల్లో నిలిచింది. శ్రీదేవి బంగ్లా అంటూ ప్రియా ప్రకాశ్ వారియర్ చేస్తున్న సినిమా టీజర్ శ్రీదేవి మరణంపై పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. తన కనుసైగలతో కుర్రకారుని ఉర్రూతలూగించిన ప్రియా ప్రకాశ్ వారియర్ బాలీవుడ్ లో చేస్తున్న సినిమా శ్రీదేవి బంగ్లా.


ఇటీవల రిలీజైన టీజర్ లో ప్రియా ప్రకాశ్ బాత్ టబ్ లో పడి ఉండటం.. సినిమా టైటిల్ శ్రీదేవి బంగ్లా అని పెట్టడంతో సినిమాకు నోటీసులు పంపించాడు బోనీ కపూర్. ఇక లేటెస్ట్ గా సినిమా నుండి మరో టీజర్ వచ్చింది. నాకు ఎంతమంది ప్రపోజ్ చేశారో తెలుసా.. అని హీరోయిన్ అంటుంది. మరో పక్క దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది అంటూ మరో పక్క ఓ వ్యక్తి ఆమెను బెదిరిస్తాడు.


సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమా ఉందనిపిస్తుంది. కచ్చితంగా శ్రీదేవి డెత్ మిస్టరీకి ఈ సినిమాకు సంబంధం ఉందని కొందరు అంటున్నారు. అయితే చిత్రయూనిట్ మాత్రం అసలు ఈ సినిమాకు శ్రీదేవికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఒరు ఆధార్ లవ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ ఈ సినిమాలో గ్లామరస్ రోల్ చేసింది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: