ప్రేమ‌క‌థ క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇంత‌కాలం ఎఫైర్లతో దాగుడుమూత‌లు ఆడుకుంటున్న ఈ జంట ప్రేమ‌క‌థ ఓ కొలిక్కి రాబోతుంది. రీసెంట్‌గా ర‌ణ్‌భీర్‌క‌పూర్‌,క‌త్రినాకైఫ్ స్పెయిన్ టూర్‌లో బ‌య‌ట‌ప‌డిన ప‌ర్సన‌ల్ ఫొటోలు మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేశాయి. అయితే ఈ విష‌యంపై ఎవరు అడిగినా ఒక‌టే స‌మాధానం చెప్పాల‌ని క‌త్రినా,ర‌ణ్‌భీర్ ఫిక్స్ అయ్యారు. అంతే కాకుండా రీసెంట్‌గా క‌త్రిన స్పెయిన్ టూర్‌పై స‌ల్మాన్‌ఖాన్ కూడ స్పంధించాడు. ఇది వాళ్ళిద్దరి ప‌ర్సన‌ల్ టూర్‌. ఎవ‌రి ఎంజాయ్ మెంట్ వాళ్ళది. ఈ టాపిక్‌ను ఎక్కువుగా మాట్లాడ‌కుండా ఉంటేనే మంచిద‌ని హిత‌వు ప‌లికాడు.

బాలీవుడ్ స‌మాచారం ప్రకారం వీరిద్దరూ త్వర‌లోనే ఒక‌టి కాబోతున్నారు. ఈ విష‌యం బాలీవుడ్ సెల‌బ్రిటీస్ అంద‌రికి తెలిసిపోయింది. మొన్నటి వ‌ర‌కూ క‌త్రినాతో ఎఫైర్లు న‌డిన హీరోలు అంద‌రూ క‌త్రినాకు ఆల్‌ద‌బెస్ట్ అని చెబుతున్నారు. రీసెంట్‌గా ర‌ణ్‌భీర్ క‌పూర్‌ను పెళ్లి గురించి అడిగిన మీడియాకు ర‌ణ్‌బీర్ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చాడు. ప్రతి రోజు మా ఇద్దరి టాపిక్ లేకుండా మీకు న్యూస్ ర‌న్ అవ్వదా, మాదేమ‌న్నా రియాలిటి షో అనుకున్నారా. మా ఇద్దరికి ప్రవేట్ లైఫ్ ఉండ‌దా అంటూ విరుకుప‌డ్డాడ‌ట‌. అంతే కాకుండా మీరు కోరుకుంటున్నదే త్వర‌లోనే ఉంటుందంటూ ఫినిష్ చేశాడంట‌. దీంతో వీరి ప్రేమ క‌థ సుఖాంతం కాబోతుంద‌ని అంటుంది బాలీవుడ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: