టాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతున్న ఈ టైంలో లేటెస్ట్ గా ఆర్జివి చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ వల్ల బయోపిక్ సినిమాల జోలికి వెళ్లకూడదు అన్న భావన కొందరికి కలుగుతుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ తీసిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల కన్నా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గురించి ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు.


అసలైతే ఈరోజు రిలీజ్ కావాల్సిన ఆ సినిమా సెన్సార్ పనులు పూర్తి కాని పక్షంలో వారం వాయిదా వేశారు. మార్చి 29న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ అవుతుంది. అయితే సినిమా ఆపాలని టిడిపి శ్రేణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఆర్జివి మాత్రం ఎలాగైనా రిలీజ్ చేసి తీరుతా అంటూ చెప్పుకొస్తున్నాడు.


ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆర్జివి తను తీయబోయే తర్వాత బయోపిక్ సినిమాల విషయాలు వెళ్లడించాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ గా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తీసిన ఆర్జివి త్వరలో వైఎస్సార్, కె.సి.ఆర్ బయోపిక్ లను తీస్తా అని చెప్పడం విశేషం. ముఖ్యంగా వైఎస్సార్ బయోపిక్ గా రెడ్డిగారు పోయారు టైటిల్ కూడా పెట్టుకున్నట్టు చెప్పాడు.


ఆ సినిమా వైఎస్ మరణించిన దగ్గర నుండి మొదలవుతుందని.. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలో జరిగిన పరిణామాలు.. వైఎస్ మరణంతో ఆనందిచిన కొందరు ప్రతిపక్షల నేతలు అలా సినిమా సాగుతుందట. ఈ సినిమా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని అన్నారు ఆర్జివి. అయితే కె.సి.ఆర్ బయోపిక్ మాత్రం ఇంకా కథ సిద్ధం చేయలేదని అన్నారు. సో వర్మ బయోపిక్ ల హవా ఇంకా కొనసాగేలానే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: