మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పటివరకు ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ రెండు సినిమాలు చేసినా అవి రెండు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకోలేదు. హీరోయిన్ గా హిట్ దక్కలేదు కాని అమ్మడి చుట్టూ రూమర్స్ మాత్రం అదరగొడుతున్నాయి. పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి కాబట్టి ఇంకా వీటి ప్రభావం ఎక్కువ ఉంది.


హీరోయిన్ గా తన కోరిక తీర్చేందుకు మాత్రమే కొన్నాళ్లు సినిమాలు చేస్తా అంటే ఒప్పుకున్నా ఆ టైం అయిపోయింది నిహారికకు త్వరలో పెళ్లి చేస్తానని మెగా బ్రదర్ నాగ బాబు మొన్నీమధ్య అన్నారు. అయితే నిహారిక పెళ్లి అనగానే ఒకసారి ప్రభాస్ తో మరోసారి విజయ్ దేవరకొండతో ఇలాంటి రూమర్స్ చాలానే వచ్చాయి.


వీటిపై నిహారిక మనసులో ఏమనుకుంటుందో తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ఎట్టకేలకు డైరెక్ట్ గా నిహారిక ఈ రూమర్స్ పై స్పందించింది. ప్రభాస్ ను మేక్ ఏ విష్ కార్యక్రమం కోసం కలిశాం తప్ప మరేమి లేదని. ఇక విజయ్ దేవరకొండను ఇప్పటివరకు అసలు కలుసుకోలేదు. అలాంటిది ఈ రూమర్స్ ఎలా వస్తాయో అర్ధం కావట్లేదని అన్నది.


ఒక హీరోయిన్ మీద ఈ విధమైన రూమర్స్ వస్తే అది ఆమె పరిధి వరకే ఉంటాయి కాని తన వెనుకాల పెద్ద ఫ్యామిలీ ఉంది కదా అందుకే తన పెళ్లి మ్యాటర్ ప్రతిసారి డిస్కషన్స్ లో ఉంటుందని చెప్పుకొచ్చింది నిహారిక. 30 లోపే తన మనసుకి నచ్చిన సినిమాలను చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. ప్రస్తుతం నిహారిక సూర్యకాంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 29న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: