టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన బాహుబలి, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సంవత్సరం గ్యాప్ తీసుకొని సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’సినిమాతో నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ మొదలై కూడా సంవత్సరం కావొస్తుంది.  ఇటీవల ఈ సినిమా హీరోయిన్ శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్బంగా అప్ డేట్ ఇచ్చారు.  బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ వివాహానికి సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.  ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రముఖ ఫోటో గ్రాఫర్ రోహాన్ శ్రేష్ఠ  కొంత కాలంగా డేటింగ్ చేస్తుందని..త్వరలో పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. 
Image result for shraddha kpoor boy friend
తాజాగా ఈ వార్తలపై శ్రద్దా కపూర్ తండ్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ స్పందించారు.  శ్ర‌ద్ధా క‌పూర్ వివాహానికి సంబంధించిన వార్తల్లో నిజం లేదని..అవ‌న్నీ అవాస్త‌వాలని కొట్టి పడేశారు. ఆమె మ‌రో ఐదేళ్ళు పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేదు. ప్ర‌స్తుతం ఆమె చేతిలో ప‌లు ప్రాజెక్టులు ఉన్నాయి. రెండేళ్ళ వ‌ర‌కు క్యాలెండ‌ర్ బిజీగా ఉందని అన్నారు. 
Related image
ఇక శ్రద్దా కపూర్ తన జీవితంలో ఎన్నడూ పెద్ద వాళ్లను ఎదిరించిన పరిస్థితులు లేవని..తమ అనుమతి లేకుండా పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని అన్నారు.  ఇక రోహన్ గురించి ప్రశ్నించగా.. ఆయన తండ్రి రాకేశ్ నాకు మంచి మిత్రుడు. మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావ‌డంతో వారిద్ద‌రు స్నేహితుల్లా ఉంటున్నారు.   శ్ర‌ద్ధా క‌పూర్ సాహో చిత్రంతో పాటు చిచ్చోరే, ఏబీసీడీ 3, బాఘీ 3 చిత్రాల‌లో నటిస్తుంది . డెంగ్యూ వ‌ల‌న తాను సైనా నెహ్వాల్ బ‌యోపిక్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న విష‌యం విదిత‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: