బాలీవుడ్ లో అలియా భట్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. స్టార్ తనయగా అలియా భట్ సినిమా సినిమాకు తన టాలెంట్ తో ఇంప్రెస్ చేస్తుంది. ఇప్పుడు ఏకంగా తెలుగులో క్రేజీ మల్టీస్టారర్ గా రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కూడా ఆమె నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా ఆమె బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకుంది.


స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ సినిమా సినిమాకు నటనలో ఎంతో పరిణితి చెందుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన రాజి సినిమా ఆమెలోని నటిని బయటపెట్టింది. రాజి సినిమాకు గాను 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో అలియా భట్ ఉత్తమ హీరోయిన్ గా అవార్డ్ అందుకుంది.    


అలియా భట్ కు ఇది రెండో ఫిల్మ్ ఫేర్ అవార్డ్. ఆల్రెడీ ఉడ్తా పంజాబి సినిమాకు 2016లో ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. 3 ఏళ్లలో రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది అలియా భట్. 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ గా రణ్ బీర్ సింగ్ సంజు సినిమాకు గాను అందుకున్నారు.


విశేషం ఏంటంటే ప్రస్తుతం ప్రేమలో ఉన్న రణ్ బీర్ సింగ్, అలియా భట్ లు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ అందుకోవడం జరిగింది. ఆర్.ఆర్.ఆర్ ముందు అలియా భట్ మరింత క్రేజ్ తెచ్చుకోగా తప్పకుండా ఆమె క్రేజ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్ ఎలా ఉంటుంది ఎలా అలరిస్తుంది అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: