సూపర్ స్టార్ మహేష్, నమ్రతలది ప్రేమ వివాహం.. అలాంటి నమ్రత మహేష్ బాబు నా రెండో భర్త అనడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. సూపర్ స్టార్ మహేష్ మైనపు బొమ్మ మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఏర్పాటు చేశారు. సోమవారం హైదరాబాద్ ఏ.ఎం.బి సినిమాస్ లో అది ఆవిష్కరించడం జరిగింది. తన స్టాట్యూని చూసి తానే షాక్ అయ్యానని.. తన బొమ్మకి ప్రాణం పోశారని టుసాడ్స్ టీం ను మెచ్చుకున్నాడు మహేష్. 


ఇక ఈవెంట్ లో భాగంగా మహేష్ స్టాట్యూని చూసి తనకు ఈరోజు నుండి ఇద్దరు భర్తలని అన్నది నమ్రత. సెలబ్రిటీస్ ఎక్కడ మాట జారుతారా  అని పట్టుకుని నానా రచ్చ చేసేద్దాం అనుకునే సోషల్ మీడియాకు నమ్రత దొరికేసింది. మహేష్ బాబు నా రెండో భర్త అంటూ వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఇదే ప్రశ్నను మహేష్ తో డైరెక్ట్ గా కూడా అడిగారు మీడియా వాళ్లు.  


దీనిపై స్పందించిన మహేష్ తన స్టాట్యూ చూసిన ఎక్సైట్మెంట్ లో నమ్రత అలా అన్నదని.. నా బొమ్మని అలా సరదాగా అన్నదని సమాధానం ఇచ్చాడు. మహేష్ మైనపు బొమ్మ అచ్చం మహేష్ లానే ఆకట్టుకుంది. మహేష్ మైనపు బొమ్మతో మహేష్ దిగిన సెల్ఫీ నిన్నటి నుండి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.


20 మంది టీం.. 6 నెలలు కష్టపడి మహేష్ మైనపు బొమ్మ తయారు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మహేష్ దగ్గర నుండి 200 మెజర్ మెంట్స్ తో ఈ స్టాట్యూ తయారు చేశారు. సింగపూర్ ఐఫా జోన్ లో మహేష్ స్టాట్యూ ప్రదర్శనలో ఉంటుంది. మహేష్ తో సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహపడే సింగపూర్ ఫ్యాన్స్.. ఇప్పుడు ఈ మైనపు బొమ్మతో సెల్ఫీ దిగొచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: