బాహుబలి సినిమా వచ్చి ఇన్ని రోజులు అవుతున్న మూవీ సంబంధించి ఉన్న కొన్ని బాకీ వివరాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. మనం మూవీని రెండున్నర గంటలు చూసి, హాయిగా తమ బాధలను మర్చిపోయి ఎంటర్నైమేంట్ అయ్యి వెళ్ళిపోతారు. కానీ దాని వెనుక ఎన్నో ఆర్థిక సమస్యలు ఉంటాయి. అవి ఒక్కోసారి ఏళ్ళు అయినా సాగుతూ ఉంటాయి.

అలాంటిదే ఈ వ్యవహారం కూడా. బాహుబలి 2 సినిమాని తమిళ వెర్షన్ లో పంపిణీ చేసిన ఎస్.రాజరాజన్ కే ప్రొడక్షన్స్ సంస్థ పేరు మీద ఆయన బాహుబలి 2 వ్యవహారాలన్నీ నడిపారు. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి పాత రికార్డులను తిరగ రాసింది. ఎప్పటికీ చెక్కు చెదరని రికార్డులను సొంతం చేసుకుంది. కానీ విడుదల సమయం నుంచే ఒరిజినల్ నిర్మాతలైన ఆర్కా సంస్థకు ఈ కె ప్రొడక్షన్స్ నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి.అయితే ఇంకా ఇప్పటికీ కూడా 17 కోట్ల 60 లక్షల రూపాయిలు రావాల్సి ఉందని తేలింది. ఆ సంస్థ కు ఈ పాటికి లీగల్ నోటీసులు కూడా వెళ్లిపోయాయి. ఆర్కా వాళ్ళు చెక్ పంపినప్పటికీ అది కాస్త బౌన్స్ అయ్యింది.

దానికి తోడుగా అంత పెద్ద మొత్తానికి సెక్యూరిటీ చూపడం కే సంస్థ ఫెయిల్ అవ్వడంతో అది కొంచెం కష్టంగా మారింది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ల కోర్ట్ తో ఆదేశాలు తెప్పించుకునే విధంగా ఆర్కా సంస్థ చర్యలు చేపట్టింది. పైకి వందల కోట్లు వసూలు చేసినా బాహుబలి మూవీ అని చెప్పుకోవడం తప్ప అలాంటి పేరున్న మూవీ కూడా ఇలాంటి సమస్య ఉంటుందని ఊహించము. సదరు రాజరాజన్ మాత్రం దీని గురించి స్పందించేందుకు ఎంత ప్రయత్నించినా మీడియాకు అందుబాటులోకి రావడం లేదు .


మరింత సమాచారం తెలుసుకోండి: