టాలీవుడ్ లోకి తేజ దర్శకత్వంలో ‘లక్ష్మీ కళ్యాణం’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్.  మొదటి సినిమాతోనే మంచి నటన ప్రదర్శించిన కాజల్ కి తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుసగా ఛాన్సులు వచ్చాయి.  ఆ మద్య బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా పెద్దగా కలిసి రాలేదు.  దాంతో దక్షిణాది సినిమాలవైపే మొగ్గు చూపింది.  ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన కాజల్ ప్రస్తుతం యంగ్ హీరోలకు సైతం సై అంటుంది.  చాలా సంవత్సరాల తర్వాత మరోసారి తేజ దర్శకత్వంలో ‘సీత’సినిమాలో నటిస్తుంది.   

ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు.  ఇప్పటి వరకు టాలీవుడ్, కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా అనుష్క, త్రిష, నయన తారలు మాత్రమే చేస్తూ వచ్చారు. మొదటి సారిగా కాజల్ కూడా అదే బాటలో నడుస్తుంది.  అయితే ఈ సినిమా  ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. 

కానీ ఆ సమయానికి థియేటర్లు దొరకడం కష్టమని రిలీజ్ డేట్ వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.  కాకపోతే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది.  ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు..విలన్ గా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నటిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: