ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ ఎటువంటి నిర్ణయం తీసుకున్న ఎటువంటి సినిమా స్టార్ట్ చేసిన ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాంగోపాల్ వర్మ చేసే కామెంట్ చుట్టూ రాష్ట్రంలో ఉన్న మరియు ఆ సినిమాకి సంబంధించిన భాష ప్రజలు ఉండేలా సంచలన కామెంట్లు చేస్తుంటారు ఆర్జివి.

Image result for rgv pawan

అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ. రాబోతున్న ఎన్నికలలో ఆంధ్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగుతానని, అది కూడా భీమవరం నుండే అని అన్నారు. నామినేషన్ల గడువు ముగిసినా స్పెషల్ పర్మిషన్ మీద నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు.

Image result for rgv pawan

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానని చాలెంజ్ కూడా వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోటీకి దిగుతున్న వర్మ భీమవరం బరిలో ఉన్న మిగతా పార్టీల అభ్యర్థుల్ని ప్రస్తావించకుండా కేవలం పవన్ మీద పోటీకి అంటుండటం జనసేన అభ్యర్థుల్లో కలకలం రెపుతోంది. మరోపక్క జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మరియు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా ఢీకొట్టే లేక ఇటువంటి చిల్లర వేషాలు వేస్తున్నారని రామ్ గోపాల్ వర్మ ని అడ్డం పెట్టుకుని పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: