టాలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో సంచలన సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు రాంగోల్ వర్మ.  గతంలో ఆయన తీసిన సినిమాలు ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. టాలీవుడ్ లో గొప్ప నటుడు..రాజకీయ నాయకుడు ఎన్టీఆర్  జీవితంపై తీసిన‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఈరోజు విడుదల అయ్యంది.  అయితే ఏపీలో ఈ సినిమాను వచ్చే నెల 3 వరకూ స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దాంతో ప్రపంచంలో ఒక్క ఏపి ప్రజలు తప్ప అందరూ చూస్తున్నారు. 

తాజాగా ఈ విషయంపై రాంగోపాల్ వర్మ  స్పందిస్తూ..ప్రప్రథమంగా తెలుగు  ప్రజలను విడగొట్టిన ఘనత దురదృష్టవశాత్తు, లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దక్కిందని వ్యాఖ్యానించారు.  సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎన్టీఆర్ ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని ఈ సినిమాలో చూపుతున్నామని వర్మ తెలిపారు. 

అయితే ఈ సినిమాపై మొదటి నుంచి ప్రత్యేక దృష్టి పెడుతూ..తెలుగు ప్రేక్షకులు చూపకుండా ఆపుతున్న తెరవెనుక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్ ఓడిపోవాలని తనలాంటి కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులు కమండలంలోని నీళ్లు తీసి శపిస్తున్నామని వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తధాస్తు అని వర్మ ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: