అంచనాలకు తగినట్టుగానే ఆర్జివి డైరక్షన్ లో వచ్చిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఎన్.టి.ఆర్ అసలు కథను కళ్లకు కట్టినట్టుగా చూపించారని తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు ఎన్.టి.ఆర్ కు చేసిన ద్రోహం.. లక్ష్మీ పార్వతి, ఎన్.టి.ఆర్ ల మధ్య అనుబంధం క్లియర్ కట్ గా చూపించాడు ఆర్జివి.


ఇక ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర కూడా ఉంది. మేజర్ చంద్రక్రాంత్ సినిమాలో ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్ పుణ్యభూమి నాదేశం సాంగ్ చూపిస్తారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఆ సాంగ్ కు ఇప్పటికి థియేటర్ లో విజిల్స్ మోగుతున్నాయి. ఆ సినిమా 100 రోజుల వేడుక మీదనే ఎన్.టి.ఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లాడుతున్నా అని ప్రకటిస్తాడు.   


సినిమా అంతా వర్మ ఎమోషనల్ జర్నీగా సాగించాడు. నిజమైన ఎన్.టి.ఆర్ అభిమానులందరికి నచ్చుతుందని చెప్పిన ఆర్జివి సినిమాను వారికి నచ్చేలానే తీశాడు. అంతేకాదు ఎన్.టి.ఆర్ అభిమానులు గర్వపడేలా సినిమా చేశాడు. ఎన్.టి.ఆర్ జీవితంలో జరిగిన అసలు కథను తెరకెక్కించిన వర్మకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.


ఇలాంటి సినిమాలు తను మాత్రమే చేయగలను అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు వర్మ. సినిమా నడిపించిన విధానం, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అంతా వర్మ స్టైల్ లోనే ఉన్నాయి. లక్ష్మీ పార్వతిగా నటించిన యజ్ఞా శెట్టి బాగా చేశారు. అంతేకాదు ఎన్.టి.ఆర్ గా నటించిన విజయ్ కుమార్ కూడా అచ్చం ఎన్.టి.ఆర్ లా నటించి మెప్పించాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: