నాపేరు సూర్య సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో చాలా గ్యాప్ తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ముఖ్యంగా ఈ సినిమా తండ్రీకొడుకుల లైన్ నేపథ్యంలో ఉంటుందని ఫిలింనగర్ టాక్. గతంలో ఇదే ఫార్ములాతో అల్లు అర్జున్ తో రెండు హిట్లు కొట్టిన త్రివిక్రం శ్రీనివాస్ మళ్లీ ఇదే ఫార్ములాని నమ్ముకుని సినిమా చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి రేగింది సినిమా ఇండస్ట్రీలో.

Image result for nana patekar allu arjun

ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ తనుశ్రీ దత్తా  క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన నానాపటేకర్ ను ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి క్యారెక్టర్లో తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చిన కారణంగా చాలా సినిమాలలో నానాపటేకర్ నీ పక్కన పెట్టారట. అటువంటి నటుడిని ఇప్పుడు టాలీవుడ్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Image result for nana patekar

ప్రస్తుతం చిత్రయూనిట్ నానాని తీసుకోవాలా..? వద్దా..? అనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ ఇటువంటి నటుడిని సినిమాలో తీసుకుంటే ఏ విధమైన వివాదాలు వస్తాయి వంటి విషయాలను కూడా ఆలోచిస్తున్నారట సినిమా యూనిట్. మొత్తం మీద నానాపటేకర్ పై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ని ఇరుకున పెట్టాయి అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు.



మరింత సమాచారం తెలుసుకోండి: