ఒకపుడు అయితే సినిమాల ప్రభావం రాజకీయాల్లో బాగా పడేది. తమిళనాడులో మొదలైన ఈ కల్చర్ ఏపీకి కూడా పాకింది. అందువల్లనే అక్కడ ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆరేళ్ళు తిరగకుండానే ఏపీలో అన్న నందమూరి సీఎం అయిపోయారు.


అయితే ఆ తరువాత అదే సినిమాలు తీసి తన ఇమేజ్ పెంచుకోవడానికి అన్న నందమూరి ప్రయత్నించినా కుదరలేదు. ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయిన తరువాత 1989లో ఉమ్మడి ఏపీలో జరిగిన సార్వత్రిక  ఎన్నికల్లో  ఓడిపోయారు. అయితే ఆ తరువాత అయిదేళ్ల కాలంలో ఆయన ఎన్నో సినిమాలు చేశారు. అయితే అవి హిట్ కాలేదు సరికదా అన్న గారి ఇమేజ్ ని కూడా మార్చలేదు. మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పాలన పట్ల జనంలో వచ్చిన వ్యతిరేకత కారణంగానే 1994 ఎన్నికల్లో అన్న గారు ముఖ్యమంత్రి కాగలిగారు. 


ఇక సినిమాలు అన్నవి కేవలం వినొదం కోసమేనని ఈనాటి తరానికి బాగా తెలుసు. అన్న గారి రోజులు వేరు. ఈ రోజులు వేరు. ఓ సినిమా అన్నది వాస్తవ సంఘటనపై తీసినట్లుగా  చెప్పినా ఎంతో కొంత సినిమాటిక్ గా కల్పన ఉంటుంది. లేకపోతే అది సెల్యూలాయిడ్ మీద పండదు. ఇక లక్ష్మీస్  ఎంటీయార్ మూవీ వల్ల చంద్రబాబు ఓడిపోతారని కానీ, ఆయన పార్టీకి నష్టం వస్తుందని కానీ ఎవరూ చెప్పలేరు కూడా. ఆ సినిమా రాకపోయినా ఆయన జీవితం గురించి అందరికీ తెలిసినా కూడా ఇప్పటికి రెండు పర్యాయాలు బాబుని జనం గెలిపించారన్నది ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అందువల్ల రాజకీయాల్లో ఎన్నో అంశాలు మిళితమై ఉంటాయి. అప్పట్లో అన్న గారు పార్టీ పెట్టి కాంగ్రెస్ ని ఓడించడానికి కూడా సినీ గ్లామర్ కంటే కూడా నాటి కాంగ్రెస్ తప్పిదాలే ప్రముఖ పాత్ర పోషించాయని చెప్పకతప్పదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: