సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్ర రాష్ట్రం మినహా ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదల అయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారి రాజకీయ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీపార్వతి ఎంట్రీ అయ్యాక రాజకీయంగా మరియు కుటుంబ పరంగా ఎటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి వంటి విషయాలను బయట ప్రపంచానికి తెలియని నికార్సైన నిప్పులాంటి సత్యాలను లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

.Image result for lakshmis ntr

ముఖ్యంగా సొంత ఇంటి వారిచేత మానసికంగా ఒక హైప్లో ఉన్న రాజకీయ నాయకుడు తీవ్ర నిరుత్సాహం లో ఉన్నప్పుడు..ఒక స్త్రీ అతని జీవితంలోకి వచ్చి తిరిగి అతనిని ఏ విధంగా ముందుకు నడిపించింది వంటి లైన్ తీసుకుని ఎక్కడా కూడా ఎవరినీ విమర్శించే విధంగా కాకుండా అద్భుతంగా లక్ష్మీపార్వతి మరియు ఎన్టీఆర్ మధ్య ఉన్న రిలేషన్ ని వెండితెరపై ఆవిష్కరించాడు రాంగోపాల్ వర్మ.

Related image

మొత్తంమీద చూసుకుంటే ఈ సినిమాలో కేవలం ప్రజల కోసం పాటుపడ్డ రాజకీయ నాయకుడిగా...సొంత ఇంటి వారి చేతనే వెలివేయబడ్డ ఎన్టీఆర్...లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేత తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూశాక అందరూ ఎన్టీఆర్ ని ఆయన సేవా రాజకీయ జీవితాన్ని పొగడ్తల వర్షం తో ముంచెత్తుతున్నారు ప్రేక్షకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: