మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఒక మనసు సినిమాతో వెండితెర తెరంగేట్రం చేసింది. అయితే అంతకుముందే ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను మెప్పించిన నిహారిక ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాలు చేసినా ఆ రెండు సినిమాలు నిరాశ పరచాయి. లేటెస్ట్ గా సూర్యకాంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిహారిక. 


ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరక్షన్ లో వచ్చిన సూర్యకాంతం సినిమా రొటీన్ కథతోనే వచ్చిందని తెలుస్తుంది. సూర్యకాంతం పాత్రలో నిహారిక బాగా నటించిందనే టాక్ వచ్చినా నిహారికకు సూర్యకాంతం సినిమా కూడా నిరాశే మిగిల్చిందని అంటున్నారు. రొటీన్ కథతో వచ్చిన ఈ సినిమా కథనంలో కూడా రొటీన్ పంథానే కొనసాగించారట.


అయితే ఒక మన్సు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో నిహారిక చాలా రిజర్వెడ్ పాత్రలో నటించగా సూర్యకాంతం సినిమాలో మాత్రం అల్లరి పిల్లగా సినిమా అంతా సందడి చేసేలా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఆమె చేసే అల్లరి కామెడీ పంచిందనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో సూర్యకాంతం చేసే అల్లరి పెద్దగా మెప్పించలేదని తెలుస్తుంది.


మెగా డాటర్ నిహారిక తన మనసుకి నచ్చిన సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే ఆమెకు సక్సెస్ మాత్రం రావట్లేదు. సూర్యకాంతం మీద ఎన్నో ఆశలు పెట్టుకోగా ఇది కూడా ఆశించిన స్థాయిలో లేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. తన రోల్ వరకు బాగున్నా నిహారిక సూర్యకాంతం మాత్రం మరో ఫెయిల్యూర్ ఆమె ఖాతాలో వేసిందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: