యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒక జాతీయ స్థాయి క్రేజ్, మరియు మార్కెట్ ఉన్న నటుడు అనే చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరంలేదు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాల అద్భుత విజయం తరువాత, ప్రభాస్ కు బాలీవుడ్ సహా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోను ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతేకాదు ఇకపై ఆయన సినిమాలు అన్ని భాషల్లోనూ విడుదల కానున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సాహో సినిమా దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అంతేకాక తదుపరి రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా కూడా భారీ బడ్జెట్ దే నట. ఇకపోతే మొదటి నుండి కొంత మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్, ఇటీవల బాహుబలి విజయాల తరువాత వచ్చిన క్రేజ్ రీత్యా, ఎప్పటికపుడు లోప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తూ వస్తున్నారు. 


ఇక నిన్న హైద్రాబాద్ లో జరిగిన విక్టరీ వెంకటేష్ కూతురు పెళ్లి రిసెప్షన్ కు ప్రభాస్ హాజరయ్యారు. ఇక ఆ ఫంక్షన్ లో ఒక్కసారిగా మెరిసిన ఆయనను అక్కడి చుట్టుప్రక్కల వారు తమ కెమెరాల్లో బంధించారు. నూనూగు మీసాలు, ట్రెండీ హెయిర్ స్టైల్, లేటెస్ట్ స్టైలిష్ ఔట్ ఫిట్ లో ఆయన్ను చూసిన వారందరూ వహ్వా అంటూ కితాబిచ్చారట. బాహుబలిలో బాగా మాస్ గా గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపించిన ప్రభాస్, సాహో సినిమాలో తన కారెక్టర్ రీత్యా ఇంత స్టైలిష్ గా తయారయ్యారని సమాచారం. 


అయితే ఆయన ఫంక్షన్ కు వచ్చారని తెలియగానే ఫంక్షన్ కు వచ్చిన వారు, ఆయన్ను చూడాలని ఒక్కసారిగా దూసుకురావడంతో, అక్కడ కొంత తోపులాట జరిగిందని సమాచారం. ఇక ఆయన ఫోటోలు క్లిక్ మనిపించిన కొందరు, వాటిని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ ఫోటోలు మీడియా వేధికల్లో విపరీతంగా సందడి చేస్తున్నాయి. ఇక వాటిని చూసిన మన  బాహుబలి ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు లేవు అనే చెప్పాలి....



మరింత సమాచారం తెలుసుకోండి: