నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. క్రికెట్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా కోసం నాని 70 రోజుల పాటు క్రికెట్ నేర్చుకున్నాడు.


సినిమా మేకింగ్ వీడియో చూస్తే సినిమా కోసం ఎంతకష్టపడ్డారో తెలుస్తుంది. దాదాపు 250 మంది కాస్ట్ అండ్ క్రూ వర్క్ చేశారు. 5 డొమెస్టిక్ మైదానాల్లో షూట్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు 130 మంది క్రికెట్ తెలిసిన వారిని ఈ సినిమాకు వాడుకున్నారట. 18 మంది పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కించారట. 


లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో నిరాశ పరచిన నాని జెర్సీతో హిట్ కొట్టడం ఫిక్స్ అని చెబుతున్నారు. జెర్సీ కోసం నాని బాగా కష్టపడ్డాడని మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఏప్రిల్ 19న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నాని హోప్స్ పెట్టుకున్నాడు. మళ్లీ రావా సినిమాతో సత్తా చాటిన గౌతం తిన్ననూరి నానితో జెర్సీ చేస్తున్నాడు.


ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. మధ్యలో రెండు సినిమాలు ఫ్లాప్ వచ్చినా జెర్సీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు నాని. మరి నాని ఇంత కష్టపడి చేసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మేకింగ్ వీడియో చూస్తే సినిమా పక్కా హిట్ అనేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: