తెలుగు సినీ ఇండ‌స్ట్రీ భారీ బడ్జెట్ శతాబ్దంలోకి వెళ్లిపోయింది. సరికొత్త సినిమా చూపించ‌డానికి భారీ ప్రాజెక్టుల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇప్పుడు 100 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే సర్వసాధారణం. ఆ వందకోట్లేనా అనే స్థాయికి వచ్చింది. వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్లు ఈజీగా రావ‌డంతో భారీ బ‌డ్జెట్‌తో రంగంలోకి దిగిపోయారు మ‌న మూవీ మేక‌ర్లు. 
 
ఈ ఏడాది టాలీవుడ్‌లో మూడు భారీ ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి. వాటిల్లో మొదటగా చెప్పుకోవలసిన సినిమా RRR.  ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జులై 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. రూ. 2000 కోట్లు అయినా రాబ‌ట్టాల‌ని జ‌క్క‌న్న టార్గెట్ పెట్టుకున్న‌ట్టు టాక్
 
ఇక బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్ అయ్యాడు. ప్ర‌భాస్ పాపులారిటీ ఓ రేంజ్‌కు వెళ్ల‌డంతో ప్రస్తుతం తెర‌కెక్కుతున్న సాహో ప్రాజెక్టుపై టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లో సైతం భారీ క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో నిర్మాతలు మేకింగ్ స్థాయి ఎక్కడా తగ్గకుండా రూ. 300 కోట్ల బడ్జెట్‌ను సాహో సినిమాకు కేటాయించారట‌. క‌లెక్ష‌న్ల ప‌రంగా రూ. 600 కోట్లు రాబ‌ట్టాల‌ని మూవీ మేక‌ర్లు టార్గెట్ పెట్టుకున్న‌ట్టు టాక్.
 
టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న మరో భారీ బ‌డ్జెట్ సినిమా సైరా. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోంది. చిరంజీవి, అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నిర్మాత రామ్‌చరణ్ దాదాపుగా రూ. 250 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారట. ఈ సినిమాకు క‌నీసంగా రూ. 400 కోట్లు రాబ‌ట్టుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ట‌.  
 
ఈ సినిమాలు వ‌రుస‌గా ఈ ఏడాది సెకండాఫ్‌లో అలాగే వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గాను రిలీజ్ కాబోతున్నాయి. టార్గెట్ పెట్టుకున్న భారీ క‌లెక్ష‌న్లు వ‌స్తే మాత్రం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స్థాయి మ‌రింతా ఘ‌నంగా పెర‌గ‌డం ఖాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: