అక్కినేని నాగ చైతన్య హీరోగా సమంత, దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా మజిలీ. షైన్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నారు. నిన్ను కోరితో హిట్ అందుకున్న శివ నిర్వాణ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా టీజర్ మొన్నామధ్య రిలీజై సూపర్ హిట్ అవగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మజిలీ ట్రైలర్ వదిలారు.


కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్టులుగా వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కినేని ఫ్యాన్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. సినిమాలో రియల్ లైఫ్ లో లానే భార్యా భర్తలుగా నటిస్తున్నారు చైతు సమంత. శివ నిర్వాణ ఈ సినిమాకు ఎమోషనల్ సీన్స్ తో నింపినట్టు ఉన్నాడు.


మజిలి ట్రైలర్ చూశాక సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి. నాగార్జున ఈ సినిమా పక్కా చైతుకి హిట్ ఇసుందని నమ్మకంగా చెప్పాడు. మజిలీ తర్వాత వెంకటేష్ తో వెంకీ మామ సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య. మజిలీ ట్రైలర్ మనసుని కదిలించేసింది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.


మజిలీ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు. అయితే తమన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడట. ఏప్రిల్ 5 ఉగాది రోజున అక్కినేని ఫ్యాన్స్ కు డబుల్ ఫెస్టివల్ ఇస్తుందని అంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
  


మరింత సమాచారం తెలుసుకోండి: