సంచనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్' ఎన్టీఆర్’ ఎన్నో వివాదాలను ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలైంది. అయితే అది కేవలం తెలంగాణాలో మాత్రమే. ఆంద్రప్రదేశ్‌లో ఈ సినిమాను విడుదల కానివ్వలేదు. తెలంగాణాలో రిలీజైన ఈ సినిమా చూసి ప్రేక్షకులు కొంతమంది నచ్చిందని వర్మను పొగడ్తలతో ముంచెత్తుతుంటే కొంతమంది మాత్రం నిజాలు చూపిస్తానన్న వర్మ అన్నీ అబద్దాలే చూపించాడని విమర్శిస్తున్నారు. ఈ పొగడ్తలు, విమర్శలు చేస్తుంది రాజకీయ నాయకుల మీదున్న అభిమానంతో, పార్టీల మీదున్న ప్రేమతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలేగాని సినిమా మీద మమకారమున్న ప్రేక్షకులు కాదని సినీ వర్గాల అభిప్రాయం.


అయితే ఈ సినిమా వల్ల నష్టపోయిందెవరు, ముడుపులు మూటగట్టుకుందెవరు...అనే ఆలోచన మాత్రం ప్రతీ ఒక్కరిలోను ఉంది. అసలు వర్మ ఈ సినిమా తీయడానికి గల కారణం ఏంటి...అసలు కారకులెవరు..అన్న అనుమానాలెన్నో ప్రజల మనసులో మెదులుతున్నాయి. ఇక సినిమా విషయానికొస్తే పేరుకే ఎన్టీఆర్బయోపిక్ గానీ, ఇది కంప్లీట్ గా ‘లక్ష్మీస్' ఎన్టీఆర్’ అని సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ అర్థమవుతుంది. ఎందుకంటే వర్మ.. లక్ష్మీ పార్వతీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమాని నడిపించాడు. ఇది చాలామంది జీర్ణించుకోలేని విషయం. అందుకే ఫస్టాఫ్ మొత్తం బోర్‌గా ఫీలవుతున్నారు ఆడియన్స్.


ఇక దాదాపుఎన్టీఆర్జీవితం తెరిచిన పుస్తకం కాబట్టి మొదట్నుంచి వర్మ ‘లక్ష్మీస్' ఎన్టీఆర్’ లో అన్ని నిజాలే చూపిస్తాననడంతో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితాధారంగా కథానాయకుడు, మహానాయకుడు అని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి 'వర్మాస్ ఎన్టీఆర్' మీదే ప్రేక్షకులు అతి ఉత్సాహాన్ని చూపించారు. అందుకు తగ్గట్టిగానే సెకండ్ హాఫ్ లో వర్మ మేకింగ్ అదిరిపోయింది. ప్రేక్షకులు ఊహించినట్టుగా, వర్మ అనుకున్నట్టుగా చాలావరకు నిజాలను తెరపైన చూపించగలిగాడు. అయితే ఎవరికి ఉపయోగపడిన.. ఉపయోగపడకపోయినా వర్మ మాత్రం బాగానే సంపాదించుకున్నాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: