ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కువగా బయోపిక్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.  స్టార్ హీరో, హీరోయిన్లు, క్రీడా, రాజకీయ రంగాల్లో తమ ప్రతిభను చాటిన వారి జీవితాలు ఆధారంగా చేసుకొని పలు బయోపిక్ సినిమాలు తెరపైకి తీసుకు వస్తున్నారు.  తెలుగు లో ఇప్పటి వరకు మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి సినిమాలు వచ్చాయి.  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎన్నో వివాదాలు నడుమ గత నెల 29న రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా ఏపిలో రిలీజ్ కాలేదు. 

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ తీసే సమయంలోనే ఎన్నో వివాదాలు సృష్టించారు.  ఈ సినిమా ఓ మాహానటుడు రాజకీయాల్లోకి వస్తే ఆయన చివరి జీవిత కాలంలో నమ్ముకున్నవారే ఎన్ని హింసలకు గురి చేశారు..ఎన్ని కుట్రలు పన్నారన్న విషయాన్ని చూపించబోతున్నానని ప్రకటించారు.  అప్పటి నుంచి ఈ సినిమాపై పలు వివాదాలు నడవటం..సినిమాపై ఆసక్తి పెరగడం జరిగిపోయింది.  మొత్తానికి సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఈ నేపథ్యంలో మరో బయోపిక్ పై దృష్టి పెట్టారు వర్మ. తాను మరో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నానంటూ వర్మ సంచలన ప్రకటన చేశారు. అది ఎవరిదో కాదు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బయోపిక్. మనసంటూ లేని కఠినాత్ములు, జైళ్లు , మన్నార్‌గుడి గ్యాంగ్స్ కు వ్యతిరేకంగా అల్లుకున్న ఓ బంధం కథ ’ పోస్టర్ రిలీజ్ చేసి అప్పుడే ఆసక్తి రేపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: