టాలీవుడ్ కింగ్ నాగార్జున 2002లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'మన్మథుడు' సినిమా సీక్వెల్ లో నటించబోతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. రీసెంట్‌గా నాగార్జున మేనల్లుడు శుశాంత్ హీరోగా వచ్చిన 'చి.ల.సౌ' చిత్రానికి దర్శకత్వం వహించిన నటుడు రాహుల్ రవీంద్రన్ 'మన్మథుడు-2' కి దరశకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు.


అప్పట్లో 'మన్మథుడు' బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి మాటల మాంత్రీకుడు త్రివిక్రం, సినిమాని అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన దర్శకుడు విజయ భాస్కర్ మేయిన్ రీజన్ అయితే.. స్క్రీన్ పై మన్మథుడిగా నాగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం మరో హైలెట్ అని చెప్పాలి. అయితే అదే మ్యాజిక్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ నాగార్జున ని ఎలా హ్యాండిల్ చెస్తాడో అన్న సందేహం కొంతమంది సినీ ప్రముఖుల్లో లేకపోలేదు. ఇక ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో గుర్తిపు పొందిన చైతన్య భరద్వాజ్‌ సంగీతమందిన్నాడు.


ఇక మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా ఎంతవరకు సక్సస్ సాధిస్తుందో చూడాలి. గతంలో వచ్చిన 'మన్మథుడు' సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా హిట్టవడానికి ఎంతో దోహదపడింది. ముఖ్యంగా మన్మథుడు ఆల్బం నాగ్ హిట్ సినిమాలలో టాప్ టెన్ లో ఉంటుందనడనంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ చైతన్య భరద్వాజ్‌ మ్యూజిక్ అందించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ లో 'పిల్లా రా'.. సాంగ్ తప్ప మరేది రిపీటెడ్ గా విన్నట్లు లేదు. మరి నాగ్ ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్నే ఎందుకు ఎంచుకున్నాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: