సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరితో జత కట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కుటుంబానికి కోడలు అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే పెళ్లయిన తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా మజిలీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ నగరంలో అతిరథ మహారథుల మధ్య ఘనంగా జరిగింది.

Image result for majili pre re

నిన్ను కోరి ఫేమ్ శివ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమా ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమని సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన నాగార్జున తెలిపారు. అయితే ఈ సందర్భంగా నాగార్జున  మాట్లాడుతూ సినిమా విషయం పక్కన పెడితే ...వారిద్దరి నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన అంటూ నాగార్జున మాట్లాడుతూ… మొదట్లో పెళ్లి అవ్వకముందు చైతూ, సమంత మధ్య రొమాన్స్ జరుగుతున్నదనే విషయం నాకు తెలియదు.

Image result for majili pre re

వారిద్దరూ అలా నన్ను మాయ చేశారు. ఓ రోజు మా ఇంటికి సమంత వచ్చింది. సమంతను చూడగానే మా కుక్క లియో పరుగెత్తికెళ్లింది. దానికి సమంత ఎలా తెలుసు అనే అనుమానం వచ్చింది. అదే విషయాన్ని అడిగితే నాకు లియో ముందు నుంచి తెలుసు మామ అన్నారు. అలా నాకు తెలియకుండా మాయ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: