కియారా అద్వానీ అతి తక్కువ సినిమాలతో ఎక్కువ పాపులారిటీని సంపాదించిన హీరోయిన్. అయితే ఇప్పుడు హిందీలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. రీసెంట్ గా ఈ భామ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది. బాలీవుడ్ ఫిలిం 'ఎబీసిడీ 2' సినిమాలో 'సున్ సాథియా' అనే ఒక సూపర్బ్ డ్యాన్స్ సాంగ్ ఉంది. సహజంగా డ్యాన్స్ పాట అనగానే బీట్ ఎక్కువగా ఉంటుంది.. ఆ బీట్ కు తగ్గట్టు పార్కులలో జనాలు చేసే ఎక్సర్ సైజులు చేస్తే సరిపోతుంది.


కానీ ఈ పాటలో బీట్ తక్కువగా ఉంటూ ఒక మెలోడీ ట్యూన్ తో సాగుతుంది.  కానీ డ్యాన్స్ మూవ్ మెంట్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి.  వరుణ్ ధావన్- శ్రద్ధా కపూర్ లతో పాటు మరో ఇద్దరు కొరియోగ్రాఫర్స్ ఆ పాటకు డ్యాన్స్ చేస్తారు. సరిగ్గా ఈ పాటను వరుణ్ ధావన్ తో కలిసి కియారా ప్రాక్టిస్ చేసింది.  జీ వారు నిర్వహించే ఈవెంట్ లో వరుణ్ - కియారాలు డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కోసం ఈ రిహార్సల్స్ చేస్తున్నారట.


ఆ రిహార్సల్ వీడియోలనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది.డ్యాన్స్ మామూలుగా లేదు.. ఇద్దరూ కలిసి స్టెప్పులను ఉతికి ఆరేశారు.   కియారా గతంలో 'ఊర్వశి ఊర్వశి' పాట రీమిక్స్ లో కూడా డ్యాన్స్ ను ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన డ్యాన్స్ టాలెంట్ ను చూపించింది.  డ్యాన్స్ వీడియోకు 'నా ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ పార్టనర్ వరుణ్ ధావన్ తో కలిసి జీ పెర్ఫార్మన్స్ కోసం రిహార్సల్ చేస్తున్నాం." అనే క్యాప్షన్ ఇచ్చింది.  ఎందుకు ఆలస్యం.. చూసేయండి!

video link: 

https://www.instagram.com/p/BvqgkKNjC66/

మరింత సమాచారం తెలుసుకోండి: