తెలుగు సినిమా రంగం అతి పెద్ద పరిశ్రమ. దాదాపుగా వందేళ్ళ చరిత్ర ఉన్నది టాలీవుడ్. అక్కడ నుంచి ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి చేరారు. తమను తాము ప్రూవ్ చేసుకున్నారు. అంతెందుకు అన్న నందమూరి తారక రామారావు సినిమా కళామ తల్లి ముద్దు బిడ్డ. ఆయన టీడీపీని ఏర్పాటు చేసి ఉమ్మడి ఏపీలో  ఎంతటి ఘన విజయం సొంతం చేసుకున్నారో అందరికీ తెలిసిందే.


ఇక ఇపుడు ఎన్నికలు ఏపీలో జరుగుతున్నాయి. సినిమా నటులు రొజుకు ఒకరుగా వచ్చి వైసీపీలో చేరుతున్నారు. అసలు టీడీపీకి సినిమా పార్టీగా పేరుంది. అలాగే మరో పార్టీ జనసేన ఏర్పాటు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఈ రెండు పార్టీలను వదిలేసి జగన్ వైపు ఎందుకు సినిమా వారు వెళ్తున్నారన్నది ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఉంది. దీనికి సీనియర్ నటీమణి, వైసీపీలో మళ్ళీ చేరిన జయసుధ  దీనికి అందమైన సమాధానం ఇచ్చారు.


అసలు సినిమా వారిలో 80 శాతం పైగా జగన్ని అభిమానించే వారు ఉన్నారని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. అది ఇవాళా, నిన్నా కానే కాదు, గత తొమ్మిదేళ్ళుగా జగన్ వెంట సినిమా జనం ఉన్నారని, కొందరి బయట పడుతున్నారు. మరి కొందరు బయటపడడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇదంతా వైఎస్సార్ నుంచి జగన్ ని వచ్చిన అభిమానం, అలాగే జగన్ సంపాదించుకున్న పేరు అని ఆమె అన్నారు. ఇపుడు సరైన సమయం వచ్చింది, ఏపీలో వైసీపీ గెలవాలి. అందుకే సినిమా జనమంతా వైసీపీకి మద్దతుగా ముందుకు వస్తున్నారు. మరింతమంది కూడా వస్తారని జయసుధ చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: