రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్ర చేసిన విజయ్ కుమార్ ఓ రంగస్థల కళాకారుడని తెలిసిందే. ఏలూరుకి చెందిన అతను ఎన్నో నాటకాల్లో నటించడం జరిగింది. ఇన్నాళ్లు నాటకాల్లో ఎన్నో పాత్రల్లో మెప్పించిన విజయ్ కుమార్ మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై ఫుల్ లెంగ్త్ రోల్ అది కూడా సీనియర్ ఎన్.టి.ఆర్ గా మెప్పించారు.


వర్మ తన సిల్వర్ స్క్రీన్ ఎన్.టి.ఆర్ ను రివీల్ చేయడమే ఆలస్యం అతనెవరనేది తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఫైనల్ గా వర్మ ద్వారానే అతని విషయాలు బయటకు వచ్చాయి. విజయ్ కుమార్ నాటకాలను ఏయన్నర్ చూసి మెచ్చుకున్నారన్న విషయాన్ని చెప్పారు విజయ్ కుమార్. ఇక తను ఎన్.టి.ఆర్ గా నటించడం ఇది మొదటిసారని అనుకున్నారు కాని ఎన్.టి.ఆ గా ఆల్రెడీ ఓ సినిమాలో చేశానని చెప్పుకొచ్చారు.


రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాలో సీనియర్ ఎన్.టి.ఆర్ గా కనిపించాల్సింది తానేనని.. రెండు రోజులు షూటింగ్ కూడా జరిగిందని కాని రాజమౌళి ఆ తర్వాత గ్రాఫిక్స్ ద్వారా మ్యానేజ్ చేశారని అన్నారు. ఆ టైంలో తనకు శివరాత్రి నాటకాలు ఉండటం వల్ల తను ఆ సినిమా చేయలేనని చెప్పానని అన్నారు. 


అప్పుడు మిస్సైన ఎన్.టి.ఆర్ ఛాన్స్ మళ్లీ వర్మ ద్వారా అతన్నే వెత్తుక్కుంటూ వెళ్లింది. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో విజయ్ కుమార్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. వర్మ టేకింగ్.. విజయ్ కుమార్ యాక్టింగ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అందుకే శుక్రవారం రిలీజైన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: