తన మనసులో ఏముంటుందో అది మొహాన్నే చెప్పడం కొందరికే చెల్లుతుంది. అలాంటి బ్యాచ్ కు కెప్టెన్ గా ఉంటాడు రాం గోపాల్ వర్మ. తను మాట్లాడే మాటలే కాదు తీసే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవడం కన్నా ముందు సోషల్ మీడియాలో సూపర్ హిట్ అవుతాయి. ఏ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి.. ఏ విషయాన్ని ఎలా రచ్చ చేయాలి అన్నది వర్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని చెప్పొచ్చు.


అయితే లేటెస్ట్ గా వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ కూడా ఎన్నో వివాదాల మధ్య రిలీజై సక్సెస్ అందుకుంది. చాలాకాలం తర్వాత వర్మ మళ్లీ తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో ఈ సినిమ తీశాడని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన లవ్ స్టోరీస్ గురించి చెప్పాడు ఆర్జివి.


తన మొదటి ప్రేమ వన్ సైడ్ లవ్ అని.. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో అదే క్యాంపస్ లో పనిచేస్తున్న ఓ కూలి చేసుకునే అమ్మాయిని చూసి ఇష్టపడ్డానని అన్నాడు వర్మ. కేవలం క్లాస్ రూం కిటికీ లోంచి చూసే ఆమెను ప్రేమించానని అన్నాడు ఆర్జివి. ఇక ఆ తర్వాత ప్రపోజ్ చేసిన వాటిల్లో మెడికల్ కాలేజ్ అమ్మాయి ఉందని అన్నారు.


ఇప్పుడు ఆమె డాక్టర్ అని ఇప్పటికి తను టచ్ లోనే ఉందని.. అయితే ఆమె పేరు చెప్పాలంటే మాత్రం తనకు ఆమెకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని అందుకే ఆమె పేరు చెప్పనని అన్నాడు ఆర్జివి. ఇక తనని ఎవరైనా ప్రేమిస్తున్నానని అంటే నచ్చదని తనని ఎంత తిట్టుకుంటే అంత హాయిగా ఉంటుందని అన్నారు. ఈకాలం ప్రేమ అంటూ చంపడం లేదా చనిపోవడం విషయాల మీద వాళ్లంతా ఫూల్స్ అంటూ చెప్పాడు ఆర్జివి. మొత్తానికి వర్మ తన మొదటి ప్రేయసి గురించి కొంత క్లూ ఇచ్చాడన్నమాట. ఇప్పటికి టచ్ లో ఉంది అంటే వర్మలో ఇంకా ఎక్కడో ప్రేమికుడు ఉన్నట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: