బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ , అలియా బట్ ఇద్దరు డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.  ఈరోజు జీ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా ఈ ప్రేమజంట అందరినీ ఆకర్షించింది.  అలియా.. రణబీర్ కపూర్.. దీపిక పదుకొనే.. రణవీర్ సింగ్ లు అందరూ ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక అరుదైన సంఘటన చోటు చోసుకుంది. రాజీ' చిత్రంలో నటనకు అలియా ఉత్తమ నటిగా ఎంపికయినట్టు ప్రకటించారు.  దీంతో ఎగ్జైట్ అయిన రణబీర్ పక్కనే కూర్చొని ఉన్న అలియాను దగ్గరగా తీసుకొని పెదవుల మీద ముద్దివ్వబోయాడు. 


కానీ రెప్పపాటులో అలియా పక్కకు జరగడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో బుగ్గపై ముద్ధిచ్చాడు.  దానికి సిగ్గుపడిన అలియా వెంటనే తమాయించుకొని మళ్ళీ రణబీర్ సింగ్ బుగ్గపై ప్రేమగా ముద్దిచ్చింది.  ఇక ఈ ముద్దులతో ఆడిటోరియంలో చప్పట్లు మార్మోగిపోయాయి.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.మరోవైపు జీ సినిమా అవార్డ్స్ లో 'సంజు' సినిమాకు గానూ ఉత్తమనటుడిగా అవార్డు లభించింది. 


ఈ కార్యక్రమంలో ఉత్తమనటుడిగా రణబీర్ పేరును అలియా స్వయంగా  ప్రకటించడమే కాకుండా అవార్డు కూడా అందించింది.  రణబీర్ తన ప్రసంగంలో తన తండ్రిగారైన రిషి కపూర్ గురించి ప్రస్తావించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.  సీనియర్ నటుడైన రిషి కపూర్ ప్రస్తుతం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే రణబీర్ కపూర్.. అలియా భట్ 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు.  ఈ సినిమాలో అక్కినేని నాగార్జున.. అమితాబ్ బచ్చన్.. డింపుల్ కపాడియాలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

video link: 

https://www.instagram.com/p/BvrbwC4njF6/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

మరింత సమాచారం తెలుసుకోండి: