అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా గురించి ఇండియన్ సిని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నది తెలిసిందే. సూపర్ హీరోస్ అందరు కలిసి నటిస్తున్న ఈ అవెంజర్స్ సీరీస్ లో ఎండ్ పార్ట్ గా వస్తున్న ఈ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు స్పెషల్ గా ఏ.ఆర్.రెహమాన్ మార్వెల్ యాంతం సిద్ధం చేశారు.   


కొద్దిగంటల క్రితం రిలీజైన రెహమాన్ మార్వెల్ యాంతం అదిరిపోయింది. రిలీజైన అతి తక్కువ టైంలో మిలియన్ మార్క్ వ్యూస్ అందుకున్న ఈ మార్వెల్ యాంతంతో మరోసారి రెహమాన్ తన సత్తా చాటాడని చెప్పొచ్చు. రొకే నా రుకెంగే అబ్ తో యారా అంటూ వచ్చిన ఈ సాంగ్ రెహమాన్ కంపొజ్ చేసి పాడటం జరిగింది. 


సూపర్ హీరోస్ అందరు కలిసి తానొస్ ను అంతం చేసేలా స్పూర్తినిస్తూ వచ్చిన ఈ సాంగ్ కేవలం ఇండియన్ స్క్రీన్స్ కోసం స్పెషల్ గా కంపోజ్ చేయించారు. ప్రైవేట్ ఆల్బమ్స్ లో రెహమాన్ సత్తా ఏంటో అందరికి తెలిసిందే. కొత్తగా అవెంజర్స్ ఎండ్ గేమ్ కోసం రెహమాన్ మార్వెల్ యాంతం తో వచ్చాడు. 


ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రెహమాన్ మార్వెల్ యాంతం వింటున్నా కొద్ది వినాలనిపిస్తుంది. మ్యూజిక్ ప్రియులకు మరోసారి రెహమాన్ నుండి ఈ అద్భుతమైన మార్వెల్ యాంతం క్రేజీగా మారింది. కచ్చితంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు రెహమాన్ యాంతం కూడా స్పెషల్ క్రేజ్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.     



మరింత సమాచారం తెలుసుకోండి: