బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త అనుకోని వివాదంలో చుక్కుకున్నాడు. నటి ఊర్వశీ రౌటెల్లాను బోనీకపూర్ తాకరాని చోట తాకరనే ప్రచారం సాగుతూ ఉంది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే బోనీ చేసిన దాంట్లో తప్పేంలేదని సదరు హీరోయిన్ అంటూ ఉండగా.. నెట్ లో మాత్రం ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక వివాహ రిసెప్షన్ కు బాలీవుడ్ తారాగణం హాజరు అయ్యింది.


ఆ కార్యక్రమానికి బోనీ కూడా వచ్చారు. బయట వీళ్లంతా ఒక్కొక్కరుగా మీడియాకు పోజులు ఇచ్చారు. ఆ సందర్భంలో ఊర్వశి అక్కడ వగలుపోతూ ఉండగా.. బోనీ అక్కడకు వచ్చారు. ఆమెతో చనువుగా వ్యవహరించారు ఆయన. అంతేకాదు.. ఆమె వీపు మీదుగా చేతులు పోనిచ్చి కాస్త కిందకు తీసుకెళ్లి.. తట్టారు. రెండు మూడుసార్లు బోనీకపూర్ అలా చేశారు.


ఒకవైపు ఆమెతో సంభాషిస్తూ, కెమెరాల వైపు చూస్తూనే బోనీ అలా చేశారు. అదంతా కెమెరాల్లో రికార్డు అయ్యింది. అయితే ఈ వ్యవహారాన్ని ఊర్వశి లైట్ తీసుకుంటోంది. ఆయన తప్పేం చేయలేదని, అనుచితంగా తాకలేదని అంటోంది. అయితే కెమెరా కళ్లకు మాత్రం ఊర్వశిని టచ్ చేస్తున్న బోనీకపూర్ చేతులే కనిపిస్తూ ఉన్నాయి! 

మరింత సమాచారం తెలుసుకోండి: