వారిద్దరూ తమిళ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోలు.  ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు..కానీ ఎవరి అభిరుచులు వారివి...ఇప్పుడు ఎవరి పార్టీ వారిది..వారే సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్. కెరీర్ బిగినింగ్ లో ప్రముఖ దర్శకులు బాల కు ఎంతో సన్నిహితంగా ఉంటూ..వీరిద్దరూ సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  రజినీకాంత్ తనదైన స్టైల్ తో అభిమానులను సంపాదిస్తే..కమల్ హాసన్ మాత్రం ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించారు.   ప్రస్తుతం కమల్ హాసన్ పూర్తి స్థాయిలో రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. 

ఇటీవల రజినీకాంత్ సైతం సొంత పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కమలహాసన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని కమలహాసన్ స్వయంగా వెల్లడించారు.  ఆ మద్య తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ సందర్భంగా రజనీ మద్దతును తాను కోరారని... ఆయన సరేనన్నారని చెప్పారు. 

రజినీలాంటి గొప్ప వ్యక్తి మన పార్టీకి అండగా ఉంటే..విజయం ఖాయం అని కమల్ అంటున్నారు. బీజేపీకి తమ పార్టీ బీ-టీమ్ కాదని చెప్పారు. 39 లోక్ సభ స్థానాలతో పాటు... ఉపఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ స్థానాల్లో కమల్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ పోటీ చేస్తోంది. అయితే, కమల్ మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: