టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు..కానీ కొద్ది మంది మాత్రమే ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. అలాంటి వారిలో సోనాలీ బింద్రె ఒకరు.    ‘ఇంద్ర’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘పలనాటి బ్రహ్మనాయుడు’, ‘శంకర్ దాదా ఎం.బీ.బీ.ఎస్’ వంటి సినిమాలతో సోనాలి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అలాంటి అందాల తార సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడ్డారనే వార్త అభిమానులను, బాలీవుడ్ వర్గాలను కుదిపేసింది.  2018 జూలైలో ఈ వార్త బయటకు రాగానే సన్నిహితులు, కుటుంబ సభ్యులు విషాదానికి లోనయ్యారు. వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తీసుకెళ్లారు. 

అయితే సోనాలి బింద్రే తనకు బతికే అవకాశం 30 శాతమేనని అధికారులు తేల్చినపుడు తన గుండె పగిలిందన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు కేన్సర్ అని తెలిసినప్పటి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు.   తనకు ఉదరభాగంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని స్కాన్ ద్వారా తెలుసుకున్నపుడు, బతికే అవకాశం చాలా తక్కువగా ఉందని అక్కడి వైద్యులు తనకు చెప్పారన్నారు. చనిపోతాననే ఆలోచన అయితే తనకు రాలేదని, పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని మాత్రం అర్థమైందన్నారు.

ప్రస్తుతం తన శరీరంపై ఎక్కువ దృష్టి పెడుతున్నానని, చిన్న చిన్న మార్పుల్ని పట్టించుకుంటున్నానని అన్నారు. క్యాన్సర్‌తో పోరాటం చేసే సమయంలో క్షణమొక యుగంలా గడిపానన్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా ఉండటంతో త్వరగా కోలుకున్నానని చెప్పారు. ఇక క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళలకు నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా..క్యాన్సర్ వచ్చిందని జాగ్రత్తగా ఉండాలి తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: