చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీ,నటులు,దర్శకులు మరికొంత మంది టెక్నీషియన్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే రీతిలో ఉంటారు.  వరుసగా సక్సెస్ సాధిస్తే స్టార్ హీరో రేంజ్ కి ఎదుగుతారు. అలాంటి హీరో వెంట దర్శక, నిర్మాతలు క్యూలు కడుతుంటారు.  హీరోయిన్ల విషయానికి వస్తే..వరుసగా విజయాలు అందుకున్న వారు పలు భాషల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంటారు.  తాజాగా  'పటాస్', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్' లతో విజయాలను అందుకున్న ఈ దర్శకుడు ఈ ఏడాదిలో 'ఎఫ్ 2'తో పెద్ద సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  దాంతో ఇప్పుడు అనీల్ రావిపూడికి డిమాండ్ బాగా పెరిగిపోయింది.  అంతే కాదు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తో అనీల్ రావిపూడి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మహేష్ బాబుతో సినిమా చేయడానికి  అతడు ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడో తెలుసా..? రూ.12 కోట్లు.

నిర్మాతలు కూడా అనీల్ అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.  ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులు  సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల వంటి వారు రెమ్యునరేషన్ గా పది నుండి పదిహేను కోట్లు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి.. మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నాడు. ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: