అక్కినేని హీరో నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ . సెన్సిటివ్, ఎమోషనల్‌ స్టోరీగా చెప్పుకొంటున్న మజిలి చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా గురించి హీరో సుశాంత్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అదేమిటంటే .. చైతన్య, సమంత పెర్ఫార్మెన్స్ బ్రిల్లియంట్. వారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. రావు రమేష్, పోసాని యాక్టింగ్ అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్ మజిలీ టీమ్ అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. 


మజిలీ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎస్ఎస్ థమన్ ఎమోషన్స్‌ను తన మ్యూజిక్ ద్వారా బయటకు తీస్తే గోపి సుందర్ చక్కటి సంగీతాన్ని ఇచ్చారు. రావురమేష్, పోసాని, ఇతర నటీనటులు ప్రతిభ ఆకట్టుకొన్నది. రిలీజ్‌కు ఓ రోజు ముందే హీరో సుశాంత్ ట్వీట్లతో హడావిడి చేశారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే మజిలీ అందమైన ప్రేమకథ.. దర్శకుడు శివ నిర్వాణ చక్కగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమా కథలో ప్రేమ, బాధ, భావోద్వేగాలు రెండు కలిసి ఉన్నాయి. ఈ సినిమాలో చైతూ, సామ్‌ కనిపించలేదు. కేవలం వాళ్లు క్యారెక్టర్లుగానే కనిపించారు. చైతూ, సమంత అద్భుతమైన నటనను ప్రదర్శించారు. దివ్వాంశ తొలి సినిమాతోనే ఆకట్టుకొన్నారు. 


నాగచైతన్య, సమంత జంట ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. వారి ప్రేమ కథ కూడా ఈ సినిమాకు పాజిటివ్ అంశంగా తోడు కానున్నది. పెళ్లి తర్వాత వారిద్దరూ కలిసి నటించడం మజిలీకి మరో ఆకర్షణ అని చెప్పవచ్చు. నాగచైతన్య క్రికెటర్‌గా, మద్యానికి బానిసైన యువకుడు పూర్ణ పాత్రలోకనిపించారు. ఆయన మాజీ ప్రేయసిగా దివ్యాంశ కౌశిక్ (అన్షు) పాత్రలో నటించింది. శ్రావణి పాత్రలో సమంత తెర మీద మెరిసింది. ఇవన్నీ సినిమాకు పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది. శివ నిర్వాణ కథ, దర్శకత్వం ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. సున్నితమైన కంటెంట్‌ను ఆసక్తికరంగా చెప్పుతారనే విషయం ఆయన సినిమాకు ఎట్రాక్షన్. ఓ డాక్టర్ చెప్పిన ప్రేమ కథ, క్రికెట్, పెళ్లి అంశాలను జోడించి మజిలిగా తెరకెక్కించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: