ఈ మద్య తమిళంలో హిట్ అయిన మూవీస్ తెలుగు లో రిమేక్ చేస్తున్నారు.  కొన్ని సినిమాలు హిట్ అవుతుంటే..మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.  అయితే తమిళంలో కొన్ని సినిమాలు డైరెక్ట్ గా డబ్ చేస్తున్నారు..అక్కడి హీరోలు.  అక్కడ హిట్ అయిన సినిమాలు ఇక్కడ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.  టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’సినిమాతో మాస్ హీరోగా పరిచయంమయ్యాడు.  ఈ సినిమా మంచి విజయం అందుకుంది. 

ఆ తర్వాత స్టార్ దర్శకులు, స్టార్ హీరోయిన్ల కాంబినేషన్ లో వచ్చినా ఈ హీరో సినిమాలు మాత్రం ఒక్కటీ విజయం సాధించలేకపోతున్నాయి.  ప్రస్తుతం తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ‘సీత’సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే.. రమేశ్ వర్మ దర్శకత్వంలో 'రాక్షసుడు' సినిమా నటించేందుకు సిద్దమవుతున్నాడు బెల్లంకొండ అబ్బాయి. తమిళంలో కొంతకాలం క్రితం విజయాన్ని అందుకున్న 'రాచ్చసన్' కి ఇది రీమేక్. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  ఇక పోస్టర్ చూస్తుంటే ఒళ్లు గగుర్బొడిచేలా కనిపిస్తుంది.  గోడల నిండా పాత పేపర్ కటింగ్స్ అతికించబడి ఉండగా .. ఆ గది పైభాగం నుంచి ఒక బొమ్మ తల వేళ్లాడుతోంది. ముఖమంతా గాయాలు చేయబడి ఆ బొమ్మ తల భయంకరంగా కనిపిస్తోంది.  ఈ పోస్టర్ ఓ ఉన్మాధి, రాక్షసుడి మనస్తత్వాన్ని అద్దంపడుతున్నట్టు కనిపిస్తుంది. ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: