ఈ మద్య సినిమాలు రిలీజ్ అవ్వడానికి ముందే..ఆ సినిమా లుక్ లీక్ అవుతున్నాయి.  ఆ మద్య సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’నరసింహారెడ్డి లో లుక్ ఎంతో సీక్రెట్ గా ఉంచాలని చూసినా షూటింగ్ మొదట్లోనే లీక్ అయ్యింది.  ఆ తర్వాత కూడా షూటింగ్ లొకేషన్స్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి.  ఇలా స్టార్ హీరోల సినిమా షూటింగ్స్ ఫోటోలు లీక్ అవుతున్న విషయం తెలిసిందే.  తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొదటి సారిగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.   

ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో ప్రీప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఇటీవల  చెన్నైలో ఓ పాపులర్ స్టూడియోస్ లో రజినీకాంత్ పై ఫోటో షూట్ నిర్వహించారు.  ఆ ఫోటో షూట్స్ ఎవరో లీక్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పోస్టర్ పై '166' అనే టైటిల్ కనిపిస్తోంది. రజినీకాంత్ గ్రే కలర్ జాకెట్ వేసుకొని గుబురు గడ్డంతో స్టైలిష్ గా కళ్లజోడు పెట్టుకొని కనిపిస్తున్నాడు. 

ఈ పోస్టర్స్ చూస్తుంటే గతంలో భాష నోట్లో సిగరెట్ పెట్టుకొని ఎంత స్టైల్ గా కనిపించాడో అలా కనిపిస్తున్నారు రజినీకాంత్.  సినిమా రజినీకాంత్ కెరీర్ లో 167వ సినిమా కాగా.. పోస్టర్ లో మాత్రం 166 అనే టైటిల్ కనిపిస్తోంది. కాగా, ఈ పోస్టర్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు చిత్ర యూనిట్ సన్నద్దమవుతున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: