సౌత్ లో సూపర్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత స్టార్ ఛాన్సులను అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సమంత సినిమాలో ఉంది అంటే కచ్చితంగా ఆ సినిమా సూపర్ హిట్ అన్నట్టే అన్నంతలా క్రేజ్ తెచ్చుకుంది. అక్కినేని కోడలిగా మారిన తర్వాత కూడా సమంత ఆ జోష్ కొనసాగిస్తుంది.


లేటెస్ట్ గా సమంత హీరోయిన్ గా నాగ చైతన్య సరసన నటించిన సినిమా మజిలీ. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రావణి పాత్రలో సమంత మరోసారి ప్రేక్షకుల మనసులను గెలిచింది. గ్లామర్ రోల్స్ చేస్తే హీరోయిన్ గా కొనసాగుతారు అన్న మాటని చెరిపేస్తూ పెళ్లి తర్వాత కూడా సమంత తన అభినయంతో కట్టిపడేస్తుంది.


మజిలీ సినిమాలో ఆమె నటనే హైలెట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నాగ చైతన్య కూడా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చైతు, సమంత ఇద్దరు రియల్ లైఫ్ భార్యాభర్తలు కావడం వల్ల కూడా సినిమాలో వారి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మెప్పించింది. మజిలీలో మరో హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ కూడా బాగానే నటించింది.


నిన్నుకోరితో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ రెండో సినిమా కూడా అలాంటి ఎమోషనల్ కథతో వచ్చి అలరించాడు. మజిలీ సినిమా బడ్జెట్ కూడా తక్కువే అవడంతో 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొదటి రోజే 5 కోట్ల దాకా వసూళు చేసింది కాబట్టి వీకెండ్ లోగా సినిమా లాభాల బాట పడుతుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: