దాదాపు ఏడాదిన్నర పాటు షూటింగ్ జరుపుకుంటుంది 'సైరా నరసింహారెడ్డి' సినిమా. ఖైదీ నెంబర్ 150 వ సినిమా తర్వాత చిరంజీవి ఈ సినిమాను మొదలు పెట్టి ఏడాదిన్నర కావస్తున్న క్రమంలో మెగా అభిమానులు సినిమా గురించి ఒక వార్త బయటకు రాకుండా ఉండటంతో నిరుత్సాహం లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను తొందరగా కంప్లీట్ చేయాలని మే నెలాఖరు కల్లా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేయాలని డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి డేట్ ఫిక్స్ చిరంజీవి చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Image result for syraa

చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నారు ఇదే క్రమంలో ఈ సినిమా అయిన వెంటనే సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాకి కూడా రామ్ చరణ్ నిర్మాత అయిన నేపథ్యంలో సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేయడానికి నిర్మాతగా తన వంతు కృషి కృషి చేస్తున్నారట చెర్రీ.

Image result for syraa

గతంలో ఈ సినిమాని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని భావించిన సినిమా యూనిట్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయకుండా రాబోతున్న దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి: