రాజకీయాల్లో సినీ తారలు ఎంతో మంది వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఐదేళ్లకు వచ్చే ఎన్నికల సమయంలో సినీ హీరో, హరోయిన్లు ముఖ్య పార్టీల్లో జాయిన్ కావడం ఆ పార్టీ నుంచి పోటీ చేయడం కామన్ అయ్యింది.  కొంత మంది భారీ మెజార్టీతో గెలిస్తే..కొంత మందికి కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్తితి ఉంది.  బాలీవుడ్ హీరోయిన్  ఊర్మిళా మతోండ్కర్ గుర్తుంది కదా..అదేనండీ రంగీళ సినిమా లో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.  తాజాగా ఊర్మిళా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరింది.  తాజాగా ఊర్మిళా మతోండ్కర్ చిక్కుల్లో పడ్డారు.  


‘హిందుత్వం అత్యంత ప్రమాదకరమైన మతం’ అంటూ హిందుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఓ టీవీ జర్నలిస్ట్‌పై కూడా ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సురేష్ నఖువా పేర్కొన్నారు. ఏప్రిల్ 5న రాత్రి 8 గంటలకు నేను ఓ టెలివిజన్ చూస్తున్నాను. ఊర్మిళ మటోండ్కర్‌ మాట్లాడుతున్నారు. ఇంతలో ‘హిందుత్వం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మతం’ అని అన్నారు.


దేశంలో హిందువులను ఆమె అవమానించారు. హిందువులను టెర్రరిస్టులుగా చూస్తున్నారు’’ అని సురేష్ పేర్కొన్నారు. హిందుత్వం ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర మతం అంటూ ఊర్మిళ అనడం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను కించపర్చడమేనని సురేష్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు హిందువులను ఉగ్రవాదులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐపీసీ సెక్షన్ 295ఏ, సెక్షన్ 505, సెక్షన్ 34 కింద ఊర్మిళపై కేసు నమోదైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: