స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే..దర్శక, నిర్మాతలు సంతోషపడాల్సింది పోయి..కంగారు పడుతున్నారు.   ఎన్నో వ్యవ ప్రయాసలకు ఓర్చి..ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఓ అగ్ర హీరో సినిమా నిర్మిస్తే..ఆ సినిమాపై ఎంతగానో ప్రమోషన్ వర్క్ చేసి ఓ అంచనాకు తీసుకు వచ్చి రిలీజ్ చేస్తే తీరా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే నెట్ లో ప్రత్యక్షం కావడం ఈ మద్య కామన్ అయ్యింది. 

ముఖ్యంగా  తమిళ రాకర్స్ తాము ఈ సినిమా పైరసీ చేస్తున్నామని చెప్పి మరీ సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హెచ్ డీ ప్రింట్ తో పైరసీ చేస్తున్నాయి.  దాంతో ఎంతో పెద్ద సినిమా అయిన కలెక్షన్లపై ఘోరమైన ప్రభావం పడుతున్నాయి.  ఇటీవల శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 మూవీ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే  తమిళ రాకర్స్ నెట్ లో పెట్టారు.  అయితే శంకర్ సాంకేతిక నిపుణులతో ఈ పైరసీ అరికట్టడానికి ఎంతగానో ప్రయత్నించిన విఫలుడయ్యాడు. 

తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య – సమంత జంటగా నటించిన మజిలీ మూవీ  ఈనెల 5 న రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా అన్ని కేంద్రాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది..అంతే కాదు ఈ నెల రోజులు పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతొ కలెక్షన్లు బాగానే వస్తాయని భావించారు చిత్ర యూనిట్.  కానీ తమిళ రాకర్స్ మజిలీ పూర్తి మూవీని హెచ్ డీ ప్రింట్ తో లీక్ చేసి షాక్ ఇచ్చారు. 

ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమాని ఇలా పైరసి చేస్తుంటే ఏం చేయలేక కుమిలి కుమిలి పోతున్నారు ఆ చిత్ర నిర్మాతలు. మొదటి రోజునే 7 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించాడు నాగచైతన్య . చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించింది మజిలీ సినిమా. అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో ఇలా మజిలీ పైరసి బారిన పట్టడం తో షాక్ అవుతున్నారు ఆ చిత్ర బృందం. 



మరింత సమాచారం తెలుసుకోండి: