కోలీవుడ్ లో కుర్ర హీరోలకు పోటీగా 60వ ఏట కూడా తన పవర్ ఏంటో చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.  ఇటీవల ఆయన నటించిన పెట్టా సినిమాలో ఎంతో ఉల్లాసంగా..ఉత్సాహంగా కనిపించాడు.  రజినీ స్టైల్ లో ఇంకా పవర్ తగ్గలేదని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.  అయితే గెలుపు..ఓటమి తేడా లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు రజినీకాంత్. శంకర్, రజినీ కాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 మూవీతో సూపర్ హిట్ అందుకున్నా..పెట్టా కాస్త నిరాశ పరిచింది.  కొంత కాలంగా రజినీకాంత్ వరుసగా మాఫియా నేపథ్యంలో ఉన్న సినిమాల్లో నటిస్తున్నారు. 

తాజాగా  మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. దర్బార్' అనే టైటిల్ ను సెట్ చేసుకుని వదిలిన ఫస్టు లుక్ .. రజనీ అభిమానులను ఆకట్టుకునేలా వుంది.  ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు టాక్. 

గతంలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.  చాలా కాలం తర్వాత మరోసారి అలాంటి పాత్రలో నటిస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు.  'దర్బార్'  టైటిల్ కి తగ్గట్టుగానే ఈ పోస్టర్లో రజనీతో పాటు గన్స్ .. బుల్లెట్స్ ..  పోలీస్ క్యాప్ .. పోలీస్ బెల్ట్ .. పోలీస్ డాగ్ .. కనిపిస్తున్నాయి. 

ఇటీవల రజినీకాంత్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇదే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.  లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో  కథానాయికగా నయనతార కనిపించనుంది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: