టాలీవుడ్ లో హాస్య బ్రహ్మ బ్రాహ్మానందం కామెడీకే వన్నె తెచ్చారు.  పాత తరం నటులు రాజబాబు, రేలంగి, పద్మనాభం తర్వాత ఆ స్థాయిలో తనదైన కామెడీ   పండించి మూడు పదుల తన కెరీర్ లో ఇప్పటికీ ఈ సినిమాలో బ్రహ్మి ఉంటే ఇంకా బాగుండూ అనే పరిస్థితిని తీసుకు వచ్చారు. అయితే ఈ మద్య బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.  ఆయనకు బైపాస్ సర్జరీ జరగడంతో కొంత కాలం విరామం తీసుకోవాల్సి వచ్చింది.  ప్రస్తుతం ఆయన తిరిగి సినిమాలపై దృష్టి పెట్టారు.  రా ఏజెంట్ గా బ్రహ్మీ ఈజ్ బ్యాక్ తో మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. 


అయితే బ్రహ్మానందం సినీ పరిశ్రమలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే కమెడియన్ అని తెలిసిందే.  రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కానటువంటి బ్రహ్మానందం కొంత కాలంగా చిన్న సినిమాలకు సైతం ఒకే అంటున్నారు.  గతంలో రోజుకి ఆరు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు బ్రహ్మీ. రెమ్యునరేషన్ విషయంలో అసలు రాజీ పడేవాడు కాదు. 

కానీ ఇప్పుడు బ్రహ్మానందం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.  ఇప్పటి వరకు తాను ఎన్నో సినిమాలు చేశానని..సీని పరిశ్రమ, ప్రేక్షకులు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని..గతంలో చిన్న సినిమాలు సైతం డబ్బు కోసమే చేసేవాడినని..ఇక తనకు డబ్బు ప్రాధాన్యత కాదని..తనకు ఏదైనా పాత్ర నచ్చితే ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటిస్తానని అన్నట్లు తెలిసింది.  ఇదే నిజమైతే బ్రహ్మా నిజంగా సంపూర్ణ హాస్యాన్ని పండించే వారే కాదు..మంచి మనసున్న మనిషిగా చిత్రపరిశ్రమలో గుర్తుండి పోతారని అంటున్నారు ఫిలిమ్ వర్గాలు. 



మరింత సమాచారం తెలుసుకోండి: