ఇప్పుడు సినీ పరిశ్రమలో బయోపిక్ ల ట్రెండ్ కొనసాతుంది.  సినీ, క్రీడా, రాజకీయ రంగానికి చెందిన వారి జీవిత కథ ఆధారంగా బయోపిక్ లు నిర్మితమవు తున్నాయి.  తెలుగు లో మహనటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత, లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చాయి.  తమిళంలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ముందుకు వచ్చారు.  ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లింది.  తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది.

ఇటీవల తెలుగు లో లక్ష్మీస్ వీరగ్రంధం అనే సినిమాతో తెగ హల్ చల్ చేసిన  ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమాను రూపొందించనున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిర్మించానని..అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చాయని అన్నారు.  తెలుగు లో ప్రస్తుతం  'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమా తీస్తున్నానని..ఈ నేపథ్యంలో తమిళ నాట పాపులర్ అయిన జయలలిత బయోపిక్ కూడా తీయలనే ఆలోచనలో ఉన్నానని అన్నారు.   ఈ మూవీకి 'శశిలలిత' అనే టైటిల్ ఫిక్స్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. 

జయలలిత నిచ్చెలి శశికళ ఆమె చనిపోయిన క్షణాల్లో దగ్గరే ఉన్నారని..ఆ సమయంలో ఎన్నో రాజకీయాలు జరిగాయని...జయలలిత మరణం తర్వాత కూడా ఎన్నో కుట్రపూరిత రాజకీయాలు జరిగాయని అన్నారు. జయలలిత జీవితానికి సంబంధించి సరికొత్త కోణం చూడబోతున్నారని చెప్పుకొచ్చారు. ఆమె గురించి తెలియని చాలా విషయాలు ఇందులో చూపించనున్నానని స్పష్టం చేశారు. ఈ సినిమాలో జయలలిత బాల్యం, సినీ నేపథ్యం, రాజకీయ జీవితం అన్ని చూపించబోతున్నట్లు కేతిరెడ్డి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: