మార్వెల్ సీరీస్ లో సూపర్ హీరోస్ అందరు కలిసి నటించిన సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఇండియాలో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో డబ్ చేసి అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. 


ఈ సినిమాలో థానోస్ కు తన వాయిస్ ఓవర్స్ అందించాడు రానా.. చిన్నప్పటి నుండి తాను కామిక్ బుక్స్, ఫిక్షన్ స్టోరీస్ అంటే ఇష్టమని.. మార్వల్ సీరీస్ లకు తాను పెద్ద ఫ్యాన్ అని అలాంటిది ఆ సినిమాలో ఈరోజు ఒక చిన్న భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు రానా. ఇక మార్వెల్ యాంతం గా రెహమాన్ ఓ స్పెషల్ సాంగ్ కంపోజ్ చేశారు. 


ఆల్రెడీ తమిళ, హింది భాషల్లో సూపర్ హిట్టైన ఆ పాట తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తెలుగులో కూడా భారీగా రిలీజ్ అవుతుంది. మార్వెల్ సీరీస్ ఫ్యాన్స్ అందరికి ఈ సినిమా గొప్ప కానుక. కచ్చితంగా ప్రేక్షకులందరిని సర్ ప్రైజ్ చేసేలా సినిమా ఉంటుందని తెలుస్తుంది.  


రానా వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ సినిమా మీద మరింత క్రేజ్ పెరిగింది. కేవలం తను హీరోగా చేయడమే కాకుండా హాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ చెబుతూ సినిమా మీద తనకున్న ఇష్టాన్ని చాటిచెబుతున్నాడు రానా దగ్గుబాటి. ఎన్నో భారీ అంచనాల మధ్య వస్తున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: