సమంత.. అందాలతోనే కాదు, తన లవ్ స్టోరీతో, అంతకు మించి మంచి హిట్టు సినిమాలతో స్టార్ అయింది. అలాంటి సమంత షోపుటప్పులకు పోకుండా తన విషయంలో నిజాన్ని ఒప్పేసుకుంది. తనని టెంప్ట్ చేస్తే ఒప్పేసుకుంటానంది. కొంపదీసి ఎవరైనా టెంప్ట్ చేయలేదు కదా... అని అక్కడిదాకా ఆలోచించొద్దు.

సమంత చెప్పింది సినిమాల గూర్చి, అందరిలాగా నాకు కథ నచ్చాలి, డైరెక్టర్, హీరో నచ్చాలి, అప్పడే సినిమాలను ఒప్పుకుంటా అని డాంబీకాలకు పోలేదు. డబ్బుకోసమే సినిమాలు తీస్తాం అంది. అంతే కాదు డబ్బు ముందు ఒక్కోసారి పాత్ర గూర్చి కూడా ఆలోచించను అంది. అలాంటి ఆఫర్లు కొన్ని టెంప్ట్ చేస్తాయి, అందుకే టెంప్ట్ చేసేంత డబ్బు ఆఫర్ వస్తే కథ, పాత్రతో సంబందం లేదంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: