షార్ట్ ఫిలిమ్స్ తో సత్తా చాటిన ప్రశాంత్ వర్మ అ!తో దర్శకుడిగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. నాని నిర్మాతగా వచ్చిన అ! తో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేశాడు డైరక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే ఇప్పుడు అతను యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ తో కల్కి సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.


1985 నేపథ్యంలో పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా మరోసారి రాజశేఖర్ సత్తా చాటేలా ఉంటుందని అంటున్నారు. అదా శర్మ, నందిత శ్వేత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు కల్కి టీజర్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ వర్మ టాలెంటెడ్ డైరక్టర్ అని అ! తో ప్రూవ్ అయ్యింది. 


ఇక గరుడవేగతో సక్సెస్ అందుకుని మళ్లీ ఫాంలోకి వచ్చిన రాజశేఖర్ కల్కితో మరోసారి అదరగొడతాడని తెలుస్తుంది. సినిమా కథ కూడా కొత్తగా ఉంటుందని.. ప్రశాంత్ వర్మ మరోసారి ఈ సినిమాతో కూడా తన క్రియేటివిటీ చూపించాడని తెలుస్తుంది. కల్కి టైటిలే డిఫరెంట్ గా ఉండగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


కొద్ది నిమిషాల క్రితం రిలీజైన కల్కి టీజర్ మరోసారి ప్రశాంత్ వర్మ టాలెంట్ చూపించాడని తెలుస్తుంది. విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నాయి. కథ రివీల్ చేయకున్నా కచ్చితంగా గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతోనే ఉంటుందని తెలుస్తుంది. టీజర్ అదరగొట్టగా కల్కి సినిమాతో మరోసారి రాజశేఖర్ తన సత్తా చాటేలా ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: