టాలీవుడ్ లో ‘ఆర్ఎక్స్ 100’సినిమాలో తనదైన అందాలు ఆరబోసి ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి పాయల్ రాజ్ పూత్.  ఈ సినిమా తర్వాత పాయల్ కి వరుసగా ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి. తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం పాయల్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.  అయితే కేవలం హీరోయిన్ గానే కాకుండా సెకండ్ హీరోయిన్ కి కూడా పాయల్ ఒకే చెబుతుంది.  ప్రస్తుతం తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ నటిస్తున్న ‘సీత’సినిమాలో పాయల్ ఐటమ్ సాంగ్ తో కిర్రెక్కించబోతుంది. 

ఇటీవల ఈ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి చేశారు.  ఈ సినిమాలో పాయల్ చేసే ఐటమ్ సాంగ్ హైలెట్ అవుతుందని దర్శకులు తేజ తెలిపారు.  తాజాగా ‘సీత’మూవీలోని  'బుల్ రెడ్డి' అనే ఐటమ్ సాంగులో పాయల్ రాజ్ పుత్ సందడి చేసింది. ఇటీవల వదిలిన లిరికల్ సాంగుకి అనూహ్యమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే.  'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ పాయల్ స్టెప్స్ అదరగొట్టేసింది.  సాహిత్యం .. సంగీతం .. కొరియోగ్రఫీ .. చిత్రీకరణ అన్నీ కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా వున్నాయి. 

ఈ పాటలో కూడా పాయల్ తన అందాల ఆరోబోతతో కనువిందు చేస్తుంది.హుషారైన గీతం కావడంతో, అన్ని ఏరియాల్లో ఈ సాంగ్ హల్ చల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మొత్తానికి ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే..సీనియర్ హీరోయిన్ల మాదిరి అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరిపించబోతుంది పాయల్ రాజ్ పూత్.  


మరింత సమాచారం తెలుసుకోండి: