నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా కోసం నాని చాలా బాగా కష్టపడ్డాడు. ఏప్రిల్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు. ఈ సినిమా తాను ఇప్పటికి 20 సార్లు చూశానని తన కెరియర్ లో బెస్ట్ మూవీ ఇదవుతుందని అంటున్నాడు నాని.


సినిమా నచ్చితే నచ్చి ఉండొచ్చు. కాని మరీ ఇలా తన సినిమా గురించి తానే 20 సార్లు చూశానని చెప్పుకోవడం కాస్త ఓవర్ గానే ఉంది. అంతేకాదు సినిమా ఫలితం తేడా కొడితే మళ్లీ ట్రోలింగ్స్ బెదడ ఉంటుంది. సినిమాపై విశ్వాసం ఉండటం వేరు ఇది పక్కా హిట్ అని చెప్పడం వేరు. అయితే అసలు రిజల్ట్ డిసైడ్ చేయాల్సింది ప్రేక్షకులు మాత్రమే.


వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని స్పీడ్ కు లాస్ట్ ఇయర్ వచ్చిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు బ్రేజ్ వేశాయి. అందుకే కథల విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నాడు నాని. జెర్సీ మేకింగ్ వీడియో.. సాంగ్స్ ఆకట్టుకోగా త్వరలో రిలీజ్ చేయబోయే ట్రైలర్ తో సినిమాపై మరింత అంచనాలు పెరుగుతాయని అంటున్నారు.


ఇక జెర్సీ సినిమా ఓ రంజీ ప్లేయర్ కథను స్పూర్తిగా తీసుకుని చేసిన సినిమా అని వచ్చిన వార్తలను కొట్టిపడేశాడు నాని. ఇది ఎవరి కథ కాదని.. సినిమాలో తనని చూస్తే నాని అన్న విషయం మర్చిపోతారని చెప్పుకొచ్చాడు నాని. మొత్తానికి నానికి జెర్సీ మీద బాగా గురి ఉన్నట్టు ఉంది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: