వేసవి కానుకగా మరికొద్ది రోజులలో విడుదల కాబోతున్న మహేష్ సినిమా 'మహర్షి'పై అభిమానులు భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్లో 25వ సినిమా అని మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని సినిమాలో ప్రతి సన్నివేశం బాగుండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు మహేష్.

Image result for maharshi

మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజర్ గురించి మాట్లాడిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా లో మహేష్ పాత్ర ఎలా ఉంటుందో కూడా కొంచెం క్లూ ఇచ్చేటట్లు మాట్లాడారు….‘ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో మహేష్ చేసిన మూడు విభిన్న లుక్స్‌ను టీజర్‌లో చూపించాలని అనుకున్నాం.

Image result for maharshi

మహేష్‌బాబు పోషించిన రిషి పాత్ర ప్రయాణమే ‘మహర్షి’ సినిమా. మనలో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రయాణం ఉంది. ఇదీ అంతే. సినిమాలో మూడు విభిన్న కాలాలు ఉంటాయి. అందుకే, మహేష్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారు’ అని వెల్లడించారు. అంతకు మించి మహేష్ పాత్ర గురించి కానీ, సినిమా గురించి కానీ చెప్పలేదు...టీజర్ లో అని పేర్కొన్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో మహేష్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా...అల్లరి నరేష్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.  .



మరింత సమాచారం తెలుసుకోండి: